శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : బుధవారం, 28 నవంబరు 2018 (13:45 IST)

ఆ బొమ్మలను చూస్తూ శృంగారం చేస్తాడు... అదేమైనా జబ్బా...?

నా వయస్సు 19 యేళ్లు. మా ఇంట్లో నాకు పెళ్లి చేసేశారు. నా భర్త నాతో శృంగారం చేసేటపుడు తన పామ్‌ట్యాప్ ఓపెన్ చేసి అందులో కొన్ని అశ్లీల బొమ్మలను చూస్తూ చేస్తాడు. మధ్యమధ్యలో వాటిని చూసి నవ్వుతుంటాడు. శృంగారం చేసినంతసేపు ఇదే తంతు. నేనొకదాన్ని ఉన్నానన్న స్పృహే ఉండదు. అతడి ప్రవర్తన గురించి ఎవరికి చెప్పినా వేరేవిధంగా అనుకుంటారని ఇక్కడికి రాస్తున్నాను...  
 
సాధారణంగా యుక్త వయస్సులో ఉండే యువతీయువకుల్లో ఇలాంటి పాంటసీలుండటం సాధారణం. తమకు నచ్చిన యువతులు, యువకులతో శృంగారంలో పాల్గొన్నట్టు ఊహించుకుంటారు. మీరు చెప్పినదాన్నిబట్టి చూస్తుంటే అతడు మరీ ఈ అశ్లీల చిత్రాల వీక్షణకు బానిసైపోయినట్లున్నాడు.

ఇలాంటివి మీకు ఇష్టం లేదని సున్నితంగా చెప్పండి. అప్పటికీ వినకపోతే అశ్లీల దృశ్యాలను తొలగిస్తానని హెచ్చరించండి. అప్పటికీ దారికి రాకపోతే మీ పెద్దవారితో సంప్రదించి తగు నిర్ణయం తీసుకోండి. అతడు మరీ ఆ చిత్రాలకు బానిసై ఉంటే మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళ్లాల్సిందే.