సోమవారం, 30 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 23 నవంబరు 2018 (12:10 IST)

నిల్చున్నపుడు కోపం వస్తే ఏం చేయాలి?

చాలామంది ప్రతి చిన్న విషయాన్ని చిర్రుబుర్రులాడుతుంటారు. మరికొందరు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకోకుండా కస్సుబుస్సులాడుతారు. సర్దిచెప్పబోతే తోక తొక్కిన తాచులా ఎగిరిపడతారు. దేన్నీ ఓ పట్టాన అర్థం చేసుకోరు. వారి కోపం, నోటి దురుసుతనం వల్ల అయినవారంతా దూరమైపోతుంటారు. పైగా, కోపంలో చెప్పేమాట అనేక అనార్థాలకు దారితీస్తుందని పెద్దలు పదేపదే చెబుతుంటారు. 
 
అందుకే కోపాన్ని ఎప్పటికపుడు నిగ్రహించుకోవాలని అంటారు మొహమ్మద్ ప్రవక్త. నిల్చున్నపుడు కోపం వస్తే కాసేపు కూర్చోవాలని, కూర్చొన్నపుడు ఆగ్రహానికి గురైతే కాసేపు నడుం వాల్చాలని, కోపం వచ్చినపుడుల్లా మనసులోనే పూజ లేదా ధ్యానం చేయాలని, ఓ గ్లాసు మంచినీళు తాగాలని మరో సందర్భంలో సెలవించారు. కోపం సైతాను ప్రవృత్తి.. దాన్ని చల్లబరచడానికి నమాజు చేయాలని ప్రవక్త సూచించారు.