మేము అబ్బాయిలం కదా... సింగిల్ నైట్‌కి ఎంత తీస్కుంటే ఏంటి?
జబర్దస్త్ షోలో అబ్బాయిలు అమ్మాయిలుగా నటించి హంగామా చేయడం గురించి తెలిసిందే. ముఖ్యంగా హరిత, సాయిలేఖ అబ్బాయిల కామెంట్లతో చాలా ఇబ్బంది పడుతున్నారట. తేడాగాడు, హిజ్రాగాడు అంటూ దారుణమైన పదజాలం వాడుతూ ఎద్దేవా చేస్తున్నారట. మరికొందరైతే ఒక్క రాత్రికి ఎంత తీస్కుంటారు అంటూ తేడాగా మాట్లాడుతున్నారట.
ఈ వ్యాఖ్యలపై జబర్దస్త్ హరిత, సాయిలేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము అబ్బాయిలం కదా... సింగిల్ నైట్‌కి ఎంత తీస్కుంటే ఏంటి... అసలు ఎందుకు ఇలాంటి కామెంట్లు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. తమకు కూడా కొన్ని యూ ట్యూబ్ చానళ్ల ద్వారానే ఈ విషయం తెలిసిందని పేర్కొన్నారు.
ఇటీవలే ప్రియాంకా సింగ్‌గా మారిన సాయితేజ లేకపోతే తాము లేమని చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తాము వున్నామంటే అందుకు కారణం సాయితేజ అంటూ కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు సాయిలేఖ.