బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 8 నవంబరు 2018 (16:48 IST)

కొన్ని చెత్త యూట్యూబ్ చానల్స్ అలా చేస్తున్నాయి.. హైపర్ ఆది

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడిగా హైపర్ ఆది కనిపిస్తాడు. పంచ్ డైలాగ్స్‌తో కితకితలు పెట్టే హైపర్ ఆదికి యూత్‌లో మంచి క్రేజ్ వుంది. ఆయన స్కిట్ కోసమే 'జబర్దస్త్' కామెడీ షోను ఫాలో అయ్యేవాళ్లు చాలామంది వున్నారు. 
 
అయితే రెండు వారాలుగా జబర్దస్త్ కామెడీ షో వేదికపై హైపర్ ఆది కనిపించడం లేదు. దీంతో తాజాగా ఆయన అమెరికా వెళ్లారని రోడ్డు ప్రమాదానికి గురయ్యారని వార్తలు వచ్చాయి. అంతేగాకుండా ఆయన పరిస్థితి విషమంగా వుందనే వార్తలు యూట్యూబ్ ఛానల్స్‌లో కనిపిస్తున్నాయి. 
 
ఈ విషయంపై హైపర్ ఆది స్పందించారు. కొన్ని చెత్త యూట్యూబ్ చానల్స్ వ్యూస్ కోసం తనకు ఏదో ప్రమాదం జరిగినట్టుగా అసత్య ప్రచారం చేస్తున్నాయని క్లారిటీ ఇచ్చారు. అలాంటి వార్తలను ఎవరూ నమ్మకండంటూ వ్యాఖ్యానించారు. తాను క్షేమంగానే వున్నానంటూ.. జోరుగా జరుగుతోన్న అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.