సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 14 నవంబరు 2018 (19:28 IST)

ఎమ్మెల్యే బాలకృష్ణ ''సంకర నా కొ...'' అంటారా? బీ కేర్ ఫుల్: పవన్ వార్నింగ్

జనసేనకు అండగా వుండే యువతను ఎమ్మెల్యే బాలకృష్ణ ''సంకర నా కొ...'' అని వ్యాఖ్యానించడంపై జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ నేతలు నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు తదితర నేతలకు పవన్ కల్యాణ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు. రాజకీయ నేతల నోట్లో బూతులేంటి.. ఇదేనా సంస్కారం అంటూ ప్రశ్నించారు. 
 
టీడీపీ నేతలే కాకుండా... బాలకృష్ణ కూడా యువతను ఇష్టారీతిన తిడుతున్నారని పవన్ హెచ్చరించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడుకు కూడా వార్నింగ్ ఇచ్చారు. ఒకటి ఉన్న కులం, రెండు లేని కులమని, మరో కులం లేదని చెప్పారు. ఇంకా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు మన గుండెల్లో చోటు లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. 
 
పనిలో పనిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై కూడా పవన్ మండిపడ్డారు. చంద్రబాబు హైదరాబాదులో చేసిన తప్పునే అమరావతిలో చేస్తున్నారని చెప్పారు. కొందరు రాజకీయ నాయకుల బిడ్డలే యువత కాదన్నారు. ఉన్నది దోపిడీ చేసే కులం, దోపిడీకి గురయ్యే కులమని చెప్పారు. ఏపీలో దోపిడీ చేసే కులాన్ని తాను సంపూర్ణంగా కూలదోస్తానని చెప్పారు. దోపిడీ చేసే టీడీపీ నేతలు అదుపులో ఉండాలన్నారు.