అల్లు అర్జున్ అంటే క్రష్.. పవన్‌తో ఆ ఛాన్స్ వస్తే.. ప్రియాంక జవల్కర్(Video)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాననంటూ.. విజయ్ దేవరకొండ హీరోగా చేసిన 'టాక్సీవాలా'లో కథానాయికగా కనిపించి ప్రియాంక జవల్కర్ చెప్పింది. టాక్సీవాలా సినిమా ఈ నెల 17వ తేదీన విడుదల కానుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై తనకి అల్లు అర్జున్‌పై క్రష్ అని చెప్పింది.
ఇంకా ఓ ఇంటర్వ్యూలో తనకు పవన్ కల్యాణ్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. పవన్ సరసన హీరోయిన్‌గా నటించాలన్నదే తన డ్రీమ్ అని.. ఆయన సినిమాలో చేసే అవకాశం వస్తే అంతకి మించిన అదృష్టం లేదు. పవన్ సరసన చేసే అవకాశం కోసం ఎదురుచూస్తూనే వుంటానని చెప్పుకొచ్చింది.
ఇక టాక్సీవాలా విడుదలైతే గ్లామర్ పరంగా ప్రియాంకకు మంచి మార్కులు పడే అవకాశం వుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు. టాక్సీవాలా చిత్రం ప్రియాంకకు డెబ్యూ మూవీ. షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ప్రియాంక వెలుగులోకి వచ్చింది. టాక్సీవాలా చిత్రం తన కెరీర్‌కు మంచి గుర్తింపును ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వీడియో చూడండి...