సంబంధిత వార్తలు
- 14న నామినేషన్ వేస్తున్న... ఎవరూ రావద్దు... గజ్వేల్‌లో కేసీఆర్
- గజ్వేల్ రైట్‌కు పోతే ఢిల్లీ... లెఫ్ట్‌కు తిప్పితే ముంబై - కేసీఆర్
- 2019లో తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి మళ్లీ కేసీఆర్... సర్వే ఫలితాలు...
- చంద్రబాబూ ఎన్నాళ్లీ కుట్రలు.. హరీష్ రావు 18 ప్రశ్నలు..?
- తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పొగడ్తలతో ముంచెత్తిన చిరంజీవి... కాంగ్రెస్‌తో కటీఫేనా?
హరీష్ రావుకు మాపై అసూయ.. కేసీఆర్ వ్యాఖ్యలు
తన మేనల్లుడు, రాష్ట్ర మాజీ మంత్రి టి. హరీష్ రావుకు అసూయ పుట్టినట్టుగా ఉందని తెరాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్న మీడియా మిత్రులతో పాటు పార్టీ నేతలు ఒక్కసారి అవాక్కయ్యారు. ఆ తర్వాత హరీష్‌కు అసూయ ఎందుకు పుట్టిందో కేసీఆర్ వివరించారు.
'ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లు చాలా అదృష్టవంతులని, సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తాను కూడా ఎంజాయ్ చేశానని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని భుజానికెత్తుకున్నాక పార్టీ అధినేతగా చాలా కష్టపడ్డా. నిద్ర లేని రాత్రులు గడిపి ప్రణాళికలు రచించాం. రాజకీయ నాయకులకు విశ్రాంతి ఉండకూడదన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పని చేయాలని హరీశ్‌కు ఆనాడే చెప్పా. అందుకే హరీశ్ సిద్దిపేట అభివృద్ధికి, కోటి ఎకరాల మాగాణికి కష్టపడుతున్నాడు. కానీ, గజ్వేల్ అభివృద్ధిని చూసి అసూయ పడుతున్నాడు. సిద్దిపేట అభివృద్ధిని గజ్వేల్ మించిపోతోందనే కావచ్చు' అంటూ కేసీఆర్ చమత్కరించడంతో భలో నవ్వులు పూయించారు.
