శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: ఆదివారం, 11 నవంబరు 2018 (18:30 IST)

గ‌జ్వేల్‌ రైట్‌కు పోతే ఢిల్లీ... లెఫ్ట్‌కు తిప్పితే ముంబై - కేసీఆర్

గజ్వేల్ నియోజకవర్గంలోని టీఆర్ఎస్ నేత‌లు, కార్యకర్తలతో ఈరోజు కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరిగింది. నియోజకవర్గంలోని 8 మండలాల నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గజ్వేల్ ప్రజలు టీఆర్ఎస్‌ను మళ్లీ గెలిపిస్తారని, అందులో ఎలాంటి సందేహం లేదని సీఎం కేసీఆర్ అన్నారు.
 
ఈ సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఈసారి కేంద్ర రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించబోతున్నాం. దుర్మార్గుల విమర్శలకు సమాధానంగా ఎన్నికలకు పోతే ఈరోజు గోళ్లు గిల్లుకుంటూ కూచున్నాయి. ఈ నెల 15 నుంచి నా టూర్లు ఉంటాయి. గజ్వెల్ కథానాయకులు మీరే. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు ప్రజాల్లోనే ఉంటూ ఎంజాయ్ చేస్తారు. సిద్దిపేట ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రజ‌ల్లోనే ఉంటూ నేనూ పని చేసేవాడిని గుర్తు చేసుకున్నారు. 
 
ఇప్పుడు పాత్ర మారింది... రాష్ట్రంలోని 31 జిల్లాలను చూసుకునే పరిస్థితి వ‌చ్చింది. గజ్వెల్ గతంలో ఉన్న దాని కంటే కాస్త మెరుగైంది. ఇక్కడితో ఆగిపోవద్దు. భూగోళంపై మానవజాతి ఉన్నంత కాలం సమస్యలు ఉంటాయి. అమెరికలోనూ సమస్యలు ఉంటాయి. గజ్వెల్ నియోజకవర్గంలో 18 ఏండ్లు నిండిన ప్రతి వ్యక్తి ఇల్లు లేకుండా ఉండకూడదు అన్నారు. డివిజన్ కేంద్రం, ఆర్డీఓ, డిఎస్పీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నాం. అన్ని రహదారులు తారురోడ్లు, డబుల్ రోడ్లు కావాలి.
 
గజ్వెల్‌కు రైలు రావాలి. అది కరీంనగర్‌కు వెళ్ళి అక్కడి నుంచి రైట్‌కు పోతే ఢిల్లీకి, లెఫ్ట్ పోతే ముంబయికి పోతది. ఈ లైన్ ఈ ప్రాంతానికి ముఖ్యంగా మారుతుంది. ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగు నీరు రావాలి అన్నారు. వచ్చే వర్షకాలం నాటికి అన్ని చెరువులు, కుంటలు నింపుకుంటాం. ఫుడ్ ప్రాసెస్ ఇండస్ట్రీస్ రావాల్సి ఉంది.. గజ్వెల్‌లో ఫస్ట్ ఫేసులోనే వస్తాయి. పంట కాలనీలు మొదట గజ్వెల్ లోనే ఏర్పాటై తెలంగాణకు ఆదర్శం కావాలి అని చెప్పారు.
 
వచ్చే రెండేళ్లలో ఇల్లు లేని కుటుంబం గజ్వెల్‌లో ఉండకూడదు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు కూడా వస్తే పాడి, పంట బాగుపడుతది. ప్రతి ఇంటికి 70 శాతం సబ్సిడిపై అందిస్తాం. నేను ప్రజల్లోకి వెళ్లి డబ్బా కొట్టుకోలే.. ప్రజల బాగు కోసం పథకాల రూపకల్పన జరగాలి... ఈ ఎర్రవల్లిలోనే 70 శాతం పథకాలను ఆలోచించి అమలు చేసాం. కంటి వెలుగు పథకాన్ని అమెరికాలో చూసి అమలు చెయలేదు.. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఆలోచించే అమలు చేశాను. ఇంత పకడ్బందీగా కంటి వెలుగు అమలు అవుతుందంటే రెండు నెలలు కష్టపడ్డా. పాత ప్రభుత్వ సంప్రదాయాలు, ఇనుపగోడలు బద్దలు కొట్టి అమలు చేస్తున్న పథకామే రైతు బంధు అని తెలియ‌చేసారు.