త్రివిక్రమ్‌కి చుక్కలు చూపిస్తున్న బన్నీ..!
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఈసారి ఎలాగైనా సరే.. హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుచేత ఏ కథ పడితే ఆ కథను ఓకే చేయాలనుకోవడం లేదు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నాడు. విక్రమ్ కుమార్‌తో సినిమా ఓకే అనుకున్నారు కానీ.. సెకండాఫ్ సంతృప్తికరంగా రాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ సినిమా చేసేందుకు ఓకే చెప్పాడు.
అయితే... ఇంతకుముందులా త్రివిక్రమ్ మాటల మాయలో పడిపోవడం లేదట. లైన్ ఓకే చేసిన బన్నీ ఫుల్ స్ర్కిప్ట్ రెడీ అయ్యాకే సినిమా స్టార్ట్ చేద్దాం అంటున్నాడట. దీంతో త్రివిక్రమ్ ప్రస్తుతం ఫుల్ స్ర్కిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. అంతేకాకుండా బన్నీ ఇటీవల స్క్రిప్ట్ సెలక్షన్ టీమ్‌ని ఏర్పాటు చేసుకున్నాడు.
ఏ కథ అయినా సరే... ఈ టీమ్ ఓకే చేసిన తర్వాతే సినిమా చేయాలనుకుంటున్నాడట. త్రివిక్రమ్ స్ర్కిప్ట్ రెడీ చేస్తున్నాడు. మరి... త్రివిక్రమ్ స్ర్కిప్ట్‌కి ఈ టీమ్ ఏమంటుందో..? బన్నీ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.