బన్నీ మూవీ ఎనౌన్స్ చేయకపోవడానికి కారణం..?
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా రిలీజై ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు నెక్ట్స్ మూవీ గురించి ఎనౌన్స్ చేయలేదు. కథలు వింటున్నాడు కానీ.. ఫైనల్ చేయడం లేదు. దీంతో బన్నీ కొత్త సినిమాని ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విక్రమ్ కుమార్‌తో దాదాపు కన్ఫర్మ్ అనుకున్న టైమ్‌లో సెకండాఫ్ సరిగా రాకపోవడం వలన క్యాన్సిల్ అయ్యింది. ఇదిలాఉంటే... మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ సినిమా చేయనున్నాడు. దీపావళి రోజున అఫిషియల్‌గా ఎనౌన్స్‌మెంట్ ఉంటుందని ప్రచారం జరిగింది.
అయితే... దీపావళి ఆ రోజున బన్నీ ట్విట్టర్లో స్పందించాడు కానీ.. సినిమాని ఎనౌన్స్ చేయలేదు. ఇంతకీ ఏమన్నాడంటే... ప్రతి ఒక్కరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి మన అందరి జీవితాల్లోకి వెలుగులు నింపాలని ఆశిస్తున్నాను. ఎప్పటినుంచో నా తదుపరి చిత్ర ప్రకటన గురించి ఎదురుచూస్తున్న నా అభిమానులకు ధన్యవాదాలు. వాటికి సంబంధించిన అధికారిక ప్రకటను త్వరలోనే ప్రకటిస్తాను అంటూ ట్వీట్ చేశాడు. మరి.. ఎప్పుడు ఎనౌన్స్ చేస్తాడో చూడాలి.