మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : ఆదివారం, 4 నవంబరు 2018 (10:10 IST)

జియో దిపావళి ధమాకా... ఈనెల 5 నుంచి...

దేశీయ టెలికాం రంగంలో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన రిలయన్స్ జియో.. మరో శుభవార్త తెలిపింది. ఈ కంపెనీ ప్రవేశపెట్టిన జియో ఫీచర్ ఫోన్ ప్రతి ఒక్కరికీ చేరువయ్యేలా కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 5వ తేదీ నుంచి ఓపెన్ సేల్‌ ప్రకటించింది. పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈనెల 5 నుంచి 12 వరకు జియో.కామ్‌లో ఈ ఫోన్‌ను ఓపెన్‌ సేల్‌ ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. 
 
రిలయన్స్ జియో ఆగస్టు 15వ తేదీన అత్యాధునిక ఫీచర్లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా జియో ఫోన్‌ 2ను రూపొందించింది. అయితే, ఈ ఫోన్ కేవలం జియో.కామ్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఫ్లాష్‌ సేల్స్‌లో మాత్రమే విక్రయిస్తూ వచ్చింది. కానీ, పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఈనెల 5 నుంచి 12 వరకు జియో.కామ్‌లో ఈ ఫోన్‌ను ఓపెన్‌ సేల్‌లో అందుబాటులో ఉంచనుంది. 
 
ఈ సేల్‌లో పేటీఎం వాలెట్‌ ద్వారా చెల్లింపులు జరిపేవారికి రూ.200 క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా లభిస్తుంది. రూ.2,999 ధరతో ఉన్న ఈ ఫోన్‌ క్వెర్టీ కీప్యాడ్‌ను కలిగి ఉంటుంది. 4జీ డ్యుయల్‌ సిమ్‌తో కూడిన ఈ ఫోన్‌ పలు జియో యాప్స్‌ కూడా కలిగి ఉంటుంది. తాజాగా వాట్సప్‌ను కూడా జత చేశారు. ఈ ఫోన్‌ వాడకందారుల కోసం జియో ప్రత్యేకంగా రూ.49, రూ.99, రూ.153 రీఛార్జి ప్యాక్‌లను రూపొందించింది. ఈ ప్యాక్‌లన్నీ 28 రోజుల చెల్లుబాటుతో ఉంటాయి. 
 
ఈ ఫోన్‌లో అన్ని ప్యాక్‌లలో జియో యాప్‌లను కాం ప్లిమెంటరీగా ఇస్తున్నారు. ఈ ఫోన్‌ 512 ఎంబీ ర్యామ్‌ను కలిగి ఉంది. 4జీబీ స్టోరేజితోపాటు మైక్రో ఎస్‌డీకార్డు ద్వారా 128జీబీ వరకు మెమరీ పెంచుకోవచ్చు. 2మెగా పిక్సెల్‌ బ్యాక్‌ కెమెరా, వీజేఏ ఫ్రంట్‌ కెమెరా, 2,000ఎంఎహెచ్‌ బ్యాటరీ, ఎఫ్‌ఎం రేడియో వంటి ఫీచర్లు ఉన్నాయి.