1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. Facebook launches Digital Literacy Library in 6 Indian languages

తెలుగుతో పాటు ఆరు భాషల్లో డిజిటల్‌ లిటరసీ లైబ్రరీ- ఫేస్‌బుక్‌

Digital Literacy Library
సోషల్ మీడియాలో అగ్రగామి అయిన ఫేస్‌బుక్ తెలుగుతో పాటు ఆరు భారతీయ భాషల్లో డిజిటల్‌ లిటరసీ లైబ్రరీని ప్రారంభించింది. ఈ విషయాన్ని  ఫేస్‌బుక్‌ వెల్లడించింది. 200 మిలియన్ల యువత ఫేస్‌బుక్‌ను కలిగివుండగా.. విద్యావేత్తల కోసం డిజిటల్ లిటరసీ లైబ్రరీలను ఏర్పాటు చేసే దిశగా ఫేస్‌బుక్ రంగం సిద్ధం చేసినట్లు తెలిపింది. 
 
డిజిటల్ లిటరసీని భారత్‌లోకి 2018 చివరికల్లా తెచ్చేందుకు దాదాపు 3 లక్షల మంది ట్రైనర్లకు శిక్షణ ఇవ్వనున్నట్లు ఫేస్‌బుక్ తెలిపింది. ఇప్పటికే రెండు లక్షల మంది తర్ఫీదు పొందారని పేర్కొంది.

ఈ ట్రైనర్లకు భారతీయ ఖాతాదారుల్లో భద్రత, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్‌, ఫేక్‌ ప్రొఫైల్స్‌ గుర్తింపు వంటి అంశాల్లో శిక్షణ ఇస్తారు. హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో డిజిటల్‌ లిటరసీ లైబ్రరీని ప్రారంభించినట్లు ఫేస్‌బుక్ తెలిపింది.
తర్వాతి కథనం
చోరీకి వచ్చి బాలికపై గ్యాంగ్ రేప్.. ఎక్కడ?