మంగళవారం, 26 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By kumar
Last Updated : మంగళవారం, 25 సెప్టెంబరు 2018 (12:05 IST)

రెండు భాషల్లో రీమేక్ కానున్న 'ఆర్ఎక్స్ 100'

తెలుగులో 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకున్న చిత్రం 'ఆర్ఎక్స్ 100'. అయితే అర్జున్ రెడ్డి ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతుండగా, 'ఆర్ఎక్స్ 100' చిత్రాన్ని కూడా అదేవిధంగా, తమిళ

తెలుగులో 'అర్జున్ రెడ్డి' తర్వాత ఆ స్థాయి విజయాన్ని అందుకున్న చిత్రం 'ఆర్ఎక్స్ 100'. అయితే అర్జున్ రెడ్డి ఇప్పటికే తమిళ, హిందీ భాషల్లో రీమేక్ అవుతుండగా, 'ఆర్ఎక్స్ 100' చిత్రాన్ని కూడా అదేవిధంగా, తమిళ హీందీ భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తమిళ రీమేక్ హక్కుల్ని ఆది పినిశెట్టి దక్కించుకున్నారు. అయితే తమిళ వెర్షన్‌లో నిర్మాత, హీరో ఆయనే కావడం విశేషం.
 
ఇలావుండగా హిందీ రీమేక్ హక్కులను సాజిద్ నదియాద్ వాలా పొందారు. ఇందులో నటుడు సునీల్ షెట్టి కొడుకు అహాన్ షెట్టి హీరోగా నటిస్తుండగా, మోహిత్ సూరి దర్శకత్వం వహిస్తారని సమాచారం. 
 
అహాన్ షెట్టిని హీరోగా పరిచయం చేయడానికి మంచి కథ కోసం వెతుకున్న సమయంలో 'ఆర్ఎక్స్ 100' కథ తనను ఎంతగానో ఆకట్టుకుందని నటుడు సునీల్ షెట్టి పేర్కొన్నారు, హిందీలో ఇలాంటి బోల్డ్ మూవీలకు ఎక్కువ ఆదరణ ఉంటుందని, అంతే కాకుండా తెరంగ్రేటం చేయడానికి కలిసొస్తుందని తెలిపారు.
 
తెలుగులో కార్తికేయ అద్భుతంగా నటించగా, దానికి ఏ మాత్రం తక్కువ కాకుండా సినిమా కోసం హీరో అహాన్ షెట్టి తీవ్రంగా కష్టపడుతున్నట్లు, దీని కోసం ఆయన నటనలో మెళకువలను నేర్చుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం.