శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Modified: బుధవారం, 1 ఆగస్టు 2018 (11:16 IST)

హిందీలో అర్జున్ రెడ్డికి ముహుర్తం ఫిక్స్..!

అర్జున్ రెడ్డి... తెలుగులో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సందీప్ వంగ తెర‌కెక్కించిన అర్జున్ రెడ్డి చిన్న సినిమాగా రూపొందిన పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఈ సినిమాని త‌మిళ్, హిందీలో రీ

అర్జున్ రెడ్డి... తెలుగులో ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో తెలిసిందే. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా సందీప్ వంగ తెర‌కెక్కించిన అర్జున్ రెడ్డి చిన్న సినిమాగా రూపొందిన పెద్ద విజ‌యాన్ని సొంతం చేసుకుని సెన్సేష‌న్ క్రియేట్ చేసాడు. ఈ సినిమాని త‌మిళ్, హిందీలో రీమేక్ చేస్తున్నారు. త‌మిళంలో స్టార్ హీరో విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ అర్జున్ రెడ్డి చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇక హిందీలో కూడా అర్జున్ రెడ్డి చిత్రాన్ని తెర పైకి తీసుకువ‌చ్చేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.
 
అర్జున్ రెడ్డి హిందీ వెర్షెన్ గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... ఆగ‌ష్టు ఫ‌స్ట్ వీక్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభించి.. వ‌చ్చే సంవ‌త్స‌రం జూన్ 21న రిలీజ్ చేయ‌డానికి నిర్ణ‌యించార‌ట‌. ఇందులో షాహిద్ క‌పూర్ హీరోగా న‌టిస్తున్నారు. తెలుగు వెర్షెన్ డైరెక్ట్ చేసిన సందీప్ వంగ హిందీ రీమేక్‌ని కూడా డైరెక్ట్ చేస్తుండ‌టం విశేషం. మ‌రి.. టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న అర్జున్ రెడ్డి బాలీవుడ్ ప్రేక్ష‌కులను కూడా ఆక‌ట్టుకుంటుంద‌ని ఆశిద్దాం.