'అర్జున్ రెడ్డి'ని జాన్వీ ఎందుకు తిరస్కరించిందంటే... షాకింగ్ న్యూస్

బాలీవుడ్ "అర్జున్ రెడ్డి" చిత్రంలో నటించేందుకు అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తొలుత ఎంపిక చేసుకోవాలని భావించారు. కానీ, ఈ ఆఫర్‌ను జాన్వీ కపూర్ తిరస్కరించింది. ఈ నిర్ణయం సర్వతా

jhanvi
pnr| Last Updated: శనివారం, 7 జులై 2018 (15:12 IST)
బాలీవుడ్ "అర్జున్ రెడ్డి" చిత్రంలో నటించేందుకు అందాల నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తొలుత ఎంపిక చేసుకోవాలని భావించారు. కానీ, ఈ ఆఫర్‌ను జాన్వీ కపూర్ తిరస్కరించింది. ఈ నిర్ణయం సర్వతా చర్చనీయాంశమైంది. అయితే, విజయ్ దేవరకొండ సరసన జాన్వీ నటించకూడదని తీసుకున్న నిర్ణయం ఆమె తీసుకున్నది కాదనీ, ఆమె మెంటర్ అయిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌ది అని తేలింది.

టాలీవుడ్‌ సెన్సేషన్‌ మూవీ అర్జున్‌రెడ్డి బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నారు. షాహిద్‌ కపూర్ ‌- తార సుటారియా జంటగా మాతృక దర్శకుడు సందీప్‌ వంగ ఈ ప్రాజెక్టును తెరకెక్కించబోతున్నాడు. త్వరలో షూటింగ్‌ ప్రారంభం కాబోతోంది. అయితే ఈ చిత్రం కోసం తొలుత జాన్వీ కపూర్‌ పేరును పరిశీలించారు.

'నిజానికి జాన్వీ కపూర్‌నే అర్జున్‌ రెడ్డి రీమేక్‌ కోసం తొలుత సంప్రదించారు. అయితే ప్రముఖ దర్శక-నిర్మాత, ఆమె మెంటర్‌ అయిన కరణ్‌ జోహర్‌ అందుకు అంగీకరించలేదు. కెరీర్‌ ప్రారంభంలోనే బోల్డ్‌ సినిమాలు చేయటం మంచిది కాదని కరణ్‌.. జాన్వీకి సూచించాడంట. దీంతో జాన్వీ ఈ ప్రాజెక్టు చేసేందుకు విముఖత వ్యక్తం చేశారంట. అంతేకాదు తార పేరును కూడా అర్జున్‌ రెడ్డి రీమేక్‌కు సూచించింది కరణే' అని ఓ ప్రముఖ బాలీవుడ్‌ మాగ్జైన్‌ కథనం ప్రచురించింది.

ఇదిలావుంటే ప్రస్తుతం జాన్వీ నటించిన "ధడక్‌" ఈ నెలలోనే విడుదలకానుంది. ప్రస్తుతం ఇషాన్‌, జాన్వీలు చిత్ర ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. శశాంక్‌ ఖైటన్‌ దర్శకత్వంలో మరాఠీ హిట్‌ సైరాట్‌కు రీమేక్‌గా తెరకెక్కిన 'ధడక్‌' ఈనెల 20వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.
దీనిపై మరింత చదవండి :