సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (14:54 IST)

ట్రంప్ పౌరసత్వ వేటు యోచన.. అమెరికాలోని భారతీయుల కథేంటి?

పౌరసత్వ వేటు యోచనపై అమెరికాలోని భారతీయ కుటుంబాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. అమెరికాలో జన్మించిన వారికి పౌరసత్వ హక్కు సంతరింపచేసే విధానానికి ట్రంప్ తూట్లు పొడవాలనుకోవడం కలవరానికి దారితీసింది. అమెరికాలో పిల్లలతో స్థిరపడ్డట్లుగా ఉన్న పలు భారతీయ సంతతి కుటుంబాలు తమ అస్తిత్వం ఏమిటనే ప్రశ్నార్థకాలను ఎదుర్కొంటున్నారు.  
 
అమెరికాలోని పలు ప్రాంతాలలోని భారతీయ యువతరం ప్రస్తుతం భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతోంది. ఇప్పటికే అమెరికాలో వివిధ సంస్థలలో గౌరవప్రదమైన ఉద్యోగ వృత్తులలో ఉన్నవారికి పలు రకాల వీసాల చిక్కులు ఎదురవుతున్నాయి. కానీ గ్రీన్‌కార్డుల కోసం ఎంతో ఆశతో దరఖాస్తులు చేసుకున్న వారికి ప్రస్తుత పరిస్థితి చూస్తే నిరాశనే ఎదురవుతోంది. 
 
లెక్కలు పరిశీలనల స్థాయి ప్రాతిపదికన చూస్తే గ్రీన్‌కార్డులు రావాలంటే దశాబ్దాలు పడుతుందని వెల్లడవుతోంది. ఇప్పుడిప్పుడే దరఖాస్తు చేసుకున్న వారికి వంద ఏళ్లు అయినా గ్రీన్‌కార్డులు రావని వెల్లడైంది. ఒబామా హయాంలోని వీసా వర్క్ పర్మిట్ల విధానంపై విరుచుకుపడాలని, స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలనే ట్రంప్ అధికార యంత్రాంగం నిర్ణయం ఇప్పుడు భారతీయ ప్రతిభాయుత, నైపుణ్యవంత యువతరంపై తీవ్రస్థాయి ప్రభావం చూపుతోంది.