అమెరికా సైన్యం అండ లేకపోతే.. సౌదీ రాజు 2 వారాలు కూడా..?: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా సైన్యం అండ లేకపోతే.. రెండు వారాలు కూడా అధికారంలో కొనసాగలేరంటూ సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చే
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోటికి పని చెప్పారు. అమెరికా సైన్యం అండ లేకపోతే.. రెండు వారాలు కూడా అధికారంలో కొనసాగలేరంటూ సౌదీ అరేబియా రాజు సల్మాన్‌ను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ కామెంట్ చేశారు. ప్రస్తుతం ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తాము సౌదీని రక్షిస్తున్నామని.. సౌదీ రాజు సల్మాన్ అంటే తమకు చాలా ఇష్టం. మిమ్మల్ని తాము రక్షిస్తున్నామని సల్మాన్‌కు చెప్పానని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము లేకుండా మీరు రెండు వారాలు కూడా ఉండలేరని తెలిపానని గుర్తు చేశారు. దీనికి ప్రతిఫలంగా తమ మిలిటరీకి మీరు చెల్లింపులు చేయాలని చెప్పానని ట్రంప్ తెలిపారు.
తన తొలి విదేశీ పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. చమురు ఎగుమతుల్లో సౌదీ అరేబియానే తొలి స్థానంలో వుంది. అయితే, చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో, సౌదీపై ట్రంప్ విమర్శలు గుప్పించారు.
చమురు మార్కెట్ ఒడిదొడుకులకులోను కాకుండా స్థిరంగా ఉండేలా సౌదీ చర్యలు చేపట్టాలని... ఇందులో భాగంగా చమురు సరఫరాను ఎప్పటిలాగానే స్థిరంగా కొనసాగించాలని తెలిపారు. చమురు ధరలన పెంచడాన్ని వారు ఆపేయాలని తాము కోరుతున్నామని తెలిపారు.