గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (17:48 IST)

ట్రంప్ ఫోన్ కాల్స్ ట్యాప్.. చైనా, రష్యా దేశాలు వింటున్నాయట..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నారట. ట్రంప్ ఫోన్ కాల్స్‌ని చైనా, రష్యా దేశాలు దొంగచాటుగా వింటున్నాయని అమెరికా నిఘావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ కాల్స్ ట్యాప్ చేస్తున్నారట. ట్రంప్ ఫోన్ కాల్స్‌ని చైనా, రష్యా దేశాలు దొంగచాటుగా వింటున్నాయని అమెరికా నిఘావర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. ఈ మేరకు ఓ కథనాన్ని ప్రచురించింది. భద్రత లేని ఫోన్‌ను ఉపయోగించడమే ట్రంప్ కాల్స్ ట్యాప్ కావడానికి కారణమని తెలుస్తోంది. 
 
రష్యా గూఢాచారులు తరచుగా ట్రంప్ ఫోన్ కాల్స్‌ని దొంగచాటుగా వింటున్నారని ట్రంప్‌ను హెచ్చరించినా ఆయన పెద్దగా పట్టించుకోలేదని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. వైట్ హౌజ్‌లోని భద్రత కలిగిన ల్యాండ్ లైన్ ఫోన్‌ని ఉపయోగించమని చెప్పినా ట్రంప్ ఐఫోన్‌ని వాడటం మానుకోలేదు. అత్యంత గోప్యత కలిగిన అంశాలను మాట్లాడేటప్పుడు ఐఫోన్‌ని ఉపయోగించకూడదని చెప్పామని వైట్ హౌజ్ అధికారులు తెలిపారు. 
 
చైనాకు చెందిన గూఢాచారులు ట్రంప్ ఫోన్ కాల్స్‌ని దొంగచాటుగా వింటున్నారని, దీనివల్ల పాలనాపరంగా అనేక ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పామని పేరు తెలియజేయడానికి ఇష్టపడని మాజీ, ప్రస్తుత అమెరికా అధికారులు తెలిపారని న్యూయార్క్ టైమ్స్ రాసింది. కానీ ఈ పత్రిక కథనంపై వైట్ హౌజ్ ఇంకా స్పందించలేదు.