ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 17 అక్టోబరు 2018 (15:28 IST)

కుక్క పిల్ల అనుకుని తెచ్చుకుంటే.. ఎలుక పిల్లగా మారిపోయింది..

శునకపు పిల్ల అనుకుని పెంచుకునేందుకు తెచ్చుకున్నారు. అయితే అది పెరిగే కొద్దీ ఎలుక పిల్లగా మారిపోయింది. దీన్ని చూసిన యజమాని షాకయ్యాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

శునకపు పిల్ల అనుకుని పెంచుకునేందుకు తెచ్చుకున్నారు. అయితే అది పెరిగే కొద్దీ ఎలుక పిల్లగా మారిపోయింది. దీన్ని చూసిన యజమాని షాకయ్యాడు. ఈ ఘటన చైనాలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. చైనాలోని స్మాల్ మౌంటేన్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి తన వీధిలో నల్లని చిన్న జీవి కనిపించింది. కుక్కపిల్ల అని దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. రోజూ దానికి ఆహారం పెట్టేవాడు.
 
అయితే ఎన్ని రోజులు అయినా ఆ జీవిగా శునకంగా మారలేదు. దీంతో అనుమానం వచ్చి ఆ నల్లని జీవి ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

అది ఓ రకమైన ఎలుక అని ఓ నెటిజన్ చెప్పడంతో అతను షాక్ అయ్యాడు. వాటిని బ్యాంబూ ర్యాట్ అని పిలుస్తారని, బ్యాంబూ చెట్లను ఆహారంగా తీసుకున్న కారణంగా వీటిని బ్యాంబూ ర్యాంట్స్ అని పిలుస్తారని వివరించాడు.