చైనాలో చినబాబు బిజీ బిజీ
చైనా పర్యటనలో ఉన్న నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా బీజింగ్‌లో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు అంతా కలిసే ఉండాలని అన్నారు. రె
చైనా పర్యటనలో ఉన్న నారా లోకేష్ బిజీబిజీగా గడుపుతున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా బీజింగ్‌లో వివిధ తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన లోకేష్, తెలుగు వారు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలని రాష్ట్రాలుగా విడిపోయినా ప్రజలు అంతా కలిసే ఉండాలని అన్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి కోసం చైనాలో ఉన్న తెలుగు వాళ్లు కృషి చెయ్యాలన్నారు.
రాయలసీమకు నీళ్లు తీసుకొని వెళ్లడం వలన వెనుకబడిన జిల్లా అనుకున్న అనంతపురం జిల్లాకి ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద కార్ల కంపెనీ కియా వచ్చిందన్నారు. ఏపీలో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఎలక్ట్రానిక్స్‌లో చైనా అందరికంటే ముందు ఉంది. ఈ రంగంలో చైనాని ఆదర్శంగా తీసుకొని.. ఏపీలో కూడా ఎలక్ట్రానిక్స్ రంగం అభివృద్ధి కోసం చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
ఇక రెండవరోజు సీఈటీసీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్‌తో లోకేష్ భేటీ అయ్యారు. సీఈటీసీ ఎలక్ట్రానిక్స్ అనే సంస్థ సోలార్ ఎనర్జీ విడి పరికరాలను తయారుచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సిఈటిసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్ స్పష్టం చేశారు.