ముందస్తుకు వెళ్లం... ఐదేళ్లూ అధికారంలో ఉంటాం : నారా లోకేశ్

తెలంగాణ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికల

pnr| Last Updated: గురువారం, 13 సెప్టెంబరు 2018 (15:39 IST)
ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉండాలన్నది ఆ రాష్ట్ర ప్రజల సెంటిమెంట్ అని ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. కానీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లారని గుర్తుచేశారు.
 
గురువారం లోకేశ్ విజయవాడలో ఐటి కంపెనీని ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభను రద్దు చేసి ముందస్తు వెళ్లే ఆలోచన లేదని తేల్చి చెప్పారు. 
 
ముందస్తుపై వస్తున్న వార్తలన్నీ తప్పుడు ప్రచారమని కొట్టి పారేశారు. ప్రస్తుతం ఎన్నికలపై ఆలోచన లేదని.. అభివృద్ధి పనుల్లో ప్రభుత్వం నిమగ్నమై ఉందన్నారు. తెలంగాణలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఐదేళ్ల పాటు నడవకపోవడం దురదృష్టకరమని లోకేశ్‌ అన్నారు. దీనిపై మరింత చదవండి :