సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 2 సెప్టెంబరు 2018 (13:32 IST)

మీకు సకల సంతోషాలు కలగాలని కోరుకుంటున్నా... పవన్‌కు లోకేశ్ బర్త్‌డే విషెస్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'హ్యపీ బర్త్ డే ప

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ఏపీ రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 'హ్యపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు. మీకు సకల సంతోషాలు కలగాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.
 
కాగా, పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు ఆదివారం శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, హీరో మంచు మనోజ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌డే పవన్‌కల్యాణ్‌ గారు. ఈ ఏడాది పుట్టినరోజు మీకు చాలా ప్రత్యేకమైంది. వచ్చే ఏడాదికల్లా మీరు రాజకీయ నేత అవుతారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మీకు శుభం జరగాలని కోరుకుంటున్నా బిగ్‌ బ్రదర్' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఈ ట్వీట్ చూసిన మెగా అభిమానులు ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు.