సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Kumar
Last Modified: సోమవారం, 24 సెప్టెంబరు 2018 (14:23 IST)

తల్లిదండ్రులు చనిపోయారు... కానీ నాలుగేళ్ల తర్వాత బిడ్డ పుట్టింది...

తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా? కచ్చితంగా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది సాధ్యపడింది. అది కూడా తల్లిదండ్రులు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం విశేషం.

తల్లిదండ్రులు లేకుండా పిల్లలు పుట్టడం సాధ్యమా? కచ్చితంగా సాధ్యం కాకపోయినప్పటికీ ఇది సాధ్యపడింది. అది కూడా తల్లిదండ్రులు చనిపోయిన 4 సంవత్సరాల తర్వాత బిడ్డ పుట్టడం విశేషం.
 
వివరాల్లోకి వెళితే, కృత్రిమ గర్భధారణ (ఐవీఎఫ్) విధానంలో పిల్లలను కనేందుకు చైనాకు చెందిన ఒక జంట ఫలదీకరణం తమ అండాలను నాన్‌జింగ్ నగరంలోని ఒక ఆసుపత్రిలో భద్రపరచుకున్నారు. అయితే వారు కారు ప్రమాదంలో 2013లోనే చనిపోయారు.
 
ఆ తర్వాత ఆ శిశువు అవ్వా తాతలు ఆ పిండం కోసం న్యాయ పోరాటం చేసి దానిపై హక్కులు సంపాదించుకున్నారు. అయితే చైనాలో సరోగసీ విధానం చట్టవిరుద్ధం కావడంతో వారు ఆగ్నేయాసియా దేశం లావోస్‌లో ఒక మహిళ అంగీకారంతో ఆ పిండాన్ని అద్దె గర్భంలో ఉంచారు. ఆ తర్వాత ఆ మహిళ గతేడాది డిసెంబర్‌లో పర్యాటక వీసాపై చైనా వచ్చి అక్కడ ప్రసవించింది. అంతేకాకుండా ఆ శిశువు తమ వాడేనని నిరూపించుకునేందుకు అవ్వాతాతలు డిఎన్ఎ పరీక్షలు చేయించుకున్నారు.