కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థాలు కలిపి....

soft drinks
Last Updated: ఆదివారం, 19 మే 2019 (10:56 IST)
రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో ఓ యువకుడు కూల్‌డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి ఓ వివాహితకు ఇచ్చాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేశారు.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నిర్మల్‌కు చెందిన అనిల్‌ నిజామాబాద్‌లోని ఎల్లమ్మగుట్ట కాలనీకి చెందిన ఓ వివాహితపై కన్నేశాడు. ఆమెతో లైంగికసుఖం పొందాలని భావించాడు. అంతే.. కూల్‌‌డ్రింక్‌లో మత్తు పదార్థాలు కలిపి ఆమెకు ఇచ్చాడు. అసలు విషయం తెలియని ఆ వివాహిత కూల్‌డ్రింక్ తాగగానే అపస్మారక స్థితిలోకి జారుకుంది.

ఇక తన పంటపండిందని భావించిన ఆ కామాంధుడు.. ఆ వివాహిత పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఫొటోలు, వీడియోలు తీశాడు. అంతేకాకుండా వాటిని ఆమె భర్తకు పంపించాడు. దీంతో భార్యను అనుమానించిన భర్త.. ఆమెను పుట్టింటికి పంపించాడు. అసభ్య వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న కామాంధుడు అనిల్‌ను.. బాధితురాలి తరపు బంధువులు పట్టుకున్నారు. అందరూ కలిసి ఆ నీచుడికి దేహశుద్ధి చేశారు.దీనిపై మరింత చదవండి :