ప్రియుడు మోజులో భర్త - కన్నబిడ్డను హత్య చేసిన భార్య...

murder
Last Updated: శనివారం, 18 మే 2019 (10:50 IST)
తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుడు మోజులోపడిన ఓ మహిళ... కట్టుకున్న భర్తతోపాటు కన్నబిడ్డను సైతం చేసింది. వేలూరు జిల్లా ఆర్కాడు సమీపంలో జరిగిన ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే,

పోలీసుల కథనం మేరకు ఈ వివరాలను పరిశీలిస్తే, తాజ్‌పురా మందవేలికి చెందిన రాజా (25) అనే వ్యక్తికి రెండేళ్ళ క్రితం దీపిక అనే యువతితో వివాహమైంది. వీరికి యేడాదిన్నర వయసున్న ప్రనీష్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో రాజా స్నేహితుడు ఒకరు తరుచూ ఇంటికి వచ్చివెళ్లేవాడు.

అతనితో దీపికకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే, దీపిక పూర్తిగా ప్రియుడుతోనే ఉండాలని భావించింది. ఇందుకోసం తన భర్తతో పాటు కన్నబిడ్డ అడ్డు తొలగించుకోవాలని భావించి, తన ప్లాన్‌ను ప్రియుడుకు చెప్పింది. వారంతా కలిసి అనుకున్నట్టుగానే రాజా, కుమారుడు ప్రినీష్‌లను హత్య చేసి, సమీపంలో ఉన్న చెరువులో పాతిపెట్టారు.

ఆ తర్వాత ఈ నెల 13వ తేదీన దీపిక ఏడుస్తూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తన భర్త, కుమారుడు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో రాజా ఫోన్ నంబరు ఇవ్వాలని పోలీసులు అడిగారు. అతడు ఫోన్ తీసుకెళ్లలేదని, ఫోన్ ఇంట్లోనే ఉందని చెప్పింది. ఆ తర్వాత పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు దీపిక పొంతనలేని సమాధానాలు ఇచ్చింది.

దీంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైనశైలిలో విచారించగా, అసలు విషయం వెల్లడైంది. అయితే, ఈ పని దీపిక, అతని ప్రియుడు మాత్రమే చేయలేరని మరికొంతమంది సాయం తీసుకుని వుంటారని పోలీసులు భావిస్తూ ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.దీనిపై మరింత చదవండి :