గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (13:50 IST)

కోడలిని పడకసుఖం ఇవ్వమన్న మామ.. భర్తకు చెప్పినా పట్టించుకోలేదనీ...

కోడలు అంటే.. కూతురుతో సమానం. కానీ, కామంతో కళ్ళుమూసుకుని పోయిన ఆ మామ మాత్రం కోడలుని మరోలా చూశాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పైటకొంగుపట్టుకుని లాగాడు. పడక సుఖం ఇవ్వమంటూ ఒత్తిడి చేశాడు. ఈ విషయాన్ని కట్టుకున్న భర్తకు చెప్పింది. అయినా ఆయనలో ఎలాంటి చలనం లేదు. పైగా చాడీలు చెబుతున్నావంటూ భార్యనే కోపగించుకున్నాడు. దీంతో ఆ వివాహిత ఎవరికి చెప్పుకోవాలో తెలియక బలన్మరణానికి పాల్పడింది. 
 
ఈ దారుణం తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లా తిరుత్తణిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తిరుత్తణికి చెందిన మునికృష్ణన్ - యువరాణి అనే దంపతులు ఉన్నారు. అయితే మునికృష్ణన్ లారీ డ్రైవర్ కావడంతో భార్యను ఇంట్లో వదిలి విధులకు వెళ్లి వారం పదిరోజులకు ఒకసారి ఇంటికివచ్చేవాడు. 
 
ఇదే అదనుగా భావించిన మునికృష్ణన్‌ తండ్రి ఢిల్లీబాబుకు కోడలు యువరాణిపై కన్నుపడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో లైంగికంగా వేధించసాగారు. ఓ రోజున విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన భర్తకు ఈ విషయాన్ని చెప్పింది. అయితే తన తండ్రిపై భార్య చాడీలు చెబుతోందన్న ఉద్దేశంతో మునికృష్ణన్‌ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఢిల్లీబాబు.. మరింత రెచ్చిపోసాగాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె పైటకొంగుపట్టుకుని లాగాడు. పడక సుఖం ఇవ్వాలంటూ ఒత్తిడి చేశాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి లోనైన యువరాణి ఇంట్లో ఉరివేసుకుంది. ఇంటికి వచ్చిన మునికృష్ణన్‌ భార్య ఆత్మహత్య వార్తతో గొల్లుమన్నాడు. మునికృష్ణన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఆత్మహత్యకు కారణమైన ఢిల్లీబాబును అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.