శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 16 మే 2019 (09:25 IST)

నీతోనే ఉంటా.. భర్త అక్కర్లేదన్న కుమార్తెను హత్య చేసిన తల్లి

తనకు భర్త అక్కర్లేదనీ, నీతోనే కలిసివుంటా అని మొండికేసిన కుమార్తెను ఓ కన్నతల్లి బండరాయితో మోది హత్య చేసింది. ఈ దారుణం మహారాష్ట్రలోని పూణెలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, పూణెకు చెందిన సంజీవని బొభాటే (34) అనే మహిళకు భర్త, కుమార్తె రితుజా (19)లతో కలిసి బారామతిలోని ప్రగతి నగర్‌లో నివసిస్తోంది. 
 
పేద కుటుంబం కావడంతో రితుజా స్థానికంగా ఉండే ఓ యువకుడిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. కానీ, రెండు నెలల్లోనే భర్త, అత్తతో గొడవ పెట్టుకుని పుట్టింటికి వచ్చింది. ఆ తర్వాత సంజీవని మాత్రం తన కుమార్తె భవిష్యత్ దృష్ట్యా కుమార్తెకు నచ్చజెప్పి ఏదో విధంగా కుమార్తెను అల్లుడు వద్దకు పంపించాలని ప్రయత్నం చేయసాగింది. 
 
ఈ విషయం తెలిసిన రితుజా.. భర్త వద్దకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పి... భర్తపై అత్యాచారం కేసు పెట్టింది. రితుజా ఇచ్చిన ఫిర్యాదుతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత రితుజా కేసు వెనక్కి తీసుకోవడంతో అతను విడుదలయ్యాడు. కానీ, రితుజాను మాత్రం కాపురానికి తీసుకెళ్లేందుకు ససేమిరా అన్నాడు. 
 
అయితే తనను ఎలాగైనా భర్త ఇంటికి పంపించాలంటూ మంగళవారం రితుజా తల్లితో మరోసారి గొడవకు దిగింది. ఈ క్రమంలో కూతురి ప్రవర్తనతో విసుగు చెందిన సంజీవని... ఆమెను చితకబాది, తలపై బండతో బలంగా కొట్టింది. దీంతో రితుజా అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటనలో సంజీవనిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.