పెళ్లికాకముందే అనుమానించాడనీ...

suicide
Last Updated: బుధవారం, 15 మే 2019 (16:44 IST)
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో ఓ యువతి చేసుకుంది. తనకు కాబోయే భర్త పెళ్లికి ముందే అనుమానించాడనీ తీవ్ర మనోవేదనకు గురైన ఆ యువతి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల ప్రాంతానికి చెందిన పుష్పారాణి (24) అనే యువతికి ఇటీవలే ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు నిర్ణయించారు.

అయితే, పుష్పారాణి మాత్రం నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో చేస్తోంది. ఈ క్రమంలో ఆ ఫ్యాక్టరీలో పని చేస్తున్న మరో యుకుడితో పుష్పారాణి సన్నిహితంగా ఉంటుందనే విషయం తనకు కాబోయే భర్త గుణశేకర్‌కు చేరింది.

దీంతో గుణశేఖర్, అతని సోదరుడు రేవంత్‌ కలిసి నాయుడుపేటకు వెళ్లి సదరు యువకుడిపై దాడి చేశారు. పుష్పారాణిని అవమానపరిచారు. తనకు జరిగిన అవమానాన్ని సోమవారం రాత్రి పుష్పారాణి తల్లికి వివరించింది.

తల్లి పట్టణానికి వెళ్లి వచ్చేలోపు ఇంటిలోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇరుగుపొరుగువారు ఆమెను కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.దీనిపై మరింత చదవండి :