శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 14 మే 2019 (12:34 IST)

పోలీస్ స్టేషన్‌కు నగ్నంగా వచ్చిన మహిళ.. ఫోటోలు, వీడియోలు తీసిన నీచులు

పోలీస్ స్టేషన్‌కు ఓ మహిళ నగ్నంగా నడుచుకుంటూ వచ్చింది. రాజస్థాన్‌లో షాక్‌కు గురిచేసే ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లో వెళితే.. మహారాష్ట్రకు చెందిన భార్యాభర్తలు రాజస్థాన్‌కు పొట్టకూటి కోసం వెళ్లారు. భర్త అసోంలో కూలీగా వలస వెళ్లగా, ఆమె అత్త, ఆడబిడ్డతో కలిసి ఉంటోంది. అయితే, వారిద్దరు భర్తలేని సమయంలో వేధింపులకు గురిచేశారు. 
 
అయితే వారి వేధింపులు శృతిమించడంతో తట్టుకోలేకపోయారు. ఓ రోజు సదరు మహిళపై దాడి చేశారు. ఆమె ఒంటిపై దుస్తులను చించేశారు. దీంతో నగ్నంగానే రోడ్డుపై నడుచుకుంటూ పోలీస్ స్టేషన్‌కు బయల్దేరింది. ఇది చూసిన కొందరు స్థానికులు ఆమెకు సాయం చేయకుండా.. మొబైల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసి.. అది చాలదన్నట్లు నీచంగా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. 
 
ఆమె అలా పోలీస్ స్టేషన్లోకి రాగానే ఆమెను చూసి షాక్‌కు గురైన పోలీసులు వెంటనే ఆమెకు దుస్తులు అందించి, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. అయితే, ఆమె పోలీస్ స్టేషన్‌కు వచ్చే దారిలో నగ్నంగా ఉందని కూడా చూడకుండా.. ఫోటోలు, వీడియోలు తీసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. 
 
అంతేకాదు, సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైన సన్నివేశాలను తొలగించారు. ఈ ఘటనపై బాధితురాలిని వేధించిన అత్త, ఆడబిడ్డలపై చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు.