గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Modified: సోమవారం, 13 మే 2019 (20:20 IST)

పోలీస్ స్టేషన్‌కి నగ్నంగా నడిచొచ్చిన బాధితురాలు... ఫోటోల కోసం కొందరు...

రాజస్థాన్ రాష్ట్రంలో మహిళలపై రోజురోజుకీ అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆదివారం రాత్రి ఓ మహిళపై ఆమె బంధువులే దాడి చేశారు. ఆమె దుస్తులను తొలగించి వివస్త్రను చేశారు. ఆమెను గొడ్డును బాదినట్లు బాదారు. ఆ దెబ్బలు తాళలేని ఆమె రోడ్డుపైకి పరుగులు తీసింది.

ఐతే అప్పటికే ఆమె వేసుకున్న దుస్తులన్నీ చింపేసారు. దాదాపు శరీరంపై దుస్తులు లేకుండా చేసేశారు. ఆ స్థితిలో ఆమె నడిరోడ్డుపై నడుచుకుంటూ తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చింది. ఐతే బాధితురాలు అలా వస్తుండగా ఆమెను ఫోటోలు తీసుకున్నారు కొందరు. 
 
కాగా ఇటీవలే ఏప్రిల్ 26న రాజస్థాన్ లోని ఆల్వారులో ఓ జంట మోటారు బైకుపై వస్తుండగా వారిని అటకాయించి, ఇద్దరి దుస్తులు విప్పేసి, భర్తను చెట్టుకు కట్టేసి అతడి కళ్ల ముందే అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు దుర్మార్గులు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియో కూడా తీశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు సరిగా స్పందించలేదన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఎస్పీని ఆ స్థానం నుంచి తొలగించింది.