శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 8 ఏప్రియల్ 2019 (09:10 IST)

వివాహితను నడిరోడ్డుపైకి లాక్కొచ్చి రాళ్ళతో చెప్పులతో కొట్టారు...

ఐటీ సిటీ బెంగుళూరు నగరంలో ఓ వివాహిత పట్ల అత్తింటి వారు అత్యంత దారుణ ఘటన జరిగింది. ఓ వివాహితను నడిరోడ్డుపై నిలబెట్టి చెప్పులతో రాళ్ళతో కొట్టారు. ఈ దాడికి ఆ మహిళ భర్త సోదరుడు (మరిది)తో పాటు అత్తింటివారు దాడికి పాల్పడ్డారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగళూర్‌లోని కమ్మనహళ్లికి చెందిన ఓ వివాహిత భర్త గత యేడాది మరణించారు. ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, ఈమె తన కుమార్తెలతో కలిసి మరిది ఇతర కుటుంబ సభ్యులతో బనస్‌వాడిలోని మెట్టినింట్లో నివసిస్తోంది. కాగా ఆమె ప్రవర్తనను నిందిస్తూ ఆడపడుచు ప్రమీల ఇటీవల బాధితురాలితో ఘర్షణకు దిగింది. ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉంటోందని నిందిస్తూ బాధితురాలిని ఇంటి నుంచి వెళ్లాలని ఆమెపై చెప్పులు, రాళ్లు విసిరేసింది. 
 
దీనిపై ఆ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మరింతగా రెచ్చిపోయిన అత్తింటివారు... ఆమెను నడిరోడ్డుపైకి లాక్కొచ్చి రాళ్లు, చెప్పులతో కొట్టారు. దీంతో ఆమె దుస్తులు కూడా చిరిగిపోయినా వారు ఏమాత్రం పట్టించుకోకుండా చితకబాదారు. ఈ దృశ్యాలను ఫోన్‌లో రికార్డు చేసిన తన కుమార్తెను సైతం వారు గాయపరిచారని తెలిపారు. కాగా బాధితురాలి ఫిర్యాదుపై సతీష్‌ను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.