గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By మోహన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (10:48 IST)

భార్యాభర్తలను వెంబడించి మరీ.. భార్యపై అత్యాచారం

హర్యానాలోని సోనిపాట్-ఝజ్జార్ నేషనల్ హైవే 334 వద్ద దారుణం జరిగింది. రోహ్‌తక్ జిల్లాల్లోని హసన్‌ఘర్ దగ్గర్లోని ప్రాంతంలో రాత్రి 8 గంటల సమయంలో ఓ జంట బైక్‌పై వెళ్తున్నారు. ముగ్గురు వ్యక్తులు వాళ్లను బైకుపై ఫాలో అయ్యారు. కొంతదూరం వెళ్లిన తర్వాత నిర్మానుష్య ప్రాంతం దగ్గర ఆ ముగ్గురు వ్యక్తులూ ముందుకు దూసుకెళ్లి... ఆ జంట బైక్‌ని అడ్డుకున్నారు. క్షణాల్లో బైక్ దిగారు. ముగ్గురిలో ఒకడు కత్తి తీసి భర్త మెడపై పెట్టి బెదిరించాడు. మిగతా ఇద్దరూ.. అతని భార్యను చెరోవైపు పట్టుకుని కొంత దూరం లాక్కుపోయి రేప్ చేసారు. భర్త దగ్గరున్న రూ.7000, ఓ మొబైల్ ఫోన్‌ని లాక్కుని, బైక్‌పై పారిపోయారు.
 
ఆ దంపతులకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కాస్త ధైర్యం తెచ్చుకొని సమీపంలో ఉన్న సంప్లా పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. కేటుగాళ్ల బైక్ నంబర్‌ను గుర్తు పెట్టుకున్న భర్త దానిని పోలీసులకు చెప్పారు. వెంటనే స్పందించిన పోలీసులు, ఆ కేటుగాళ్లు ఎటువైపు వెళ్లారో అటువైపుగా ఉన్న పోలీసులను అలెర్ట్ చేసారు. వాహనం నంబర్ ఆధారంగా ముగ్గురిలో ఒకడైన సాగర్‌ని పట్టుకున్నారు. అతడు రాజస్థాన్‌లోని నయబాస్ గ్రామానికి చెందినవాడిగా గుర్తించారు. మిగతా ఇద్దర్నీ పట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదంటున్నారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి పంపించారు.