గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (20:48 IST)

ఫేస్‌బుక్‌లో పెళ్ళి శుభాకాంక్షలు చెప్పినందుకు చితక్కొట్టిన పోలీసు.. ఎక్కడ?

తిరుపతి నెహ్రూనగర్ లోని ఒక పెళ్ళి ఇంటి వద్ద అలిపిరి ఎఎస్ఐ రాము వీరంగం సృష్టించారు. ఓ ప్రేమ పెళ్ళి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు అలిపిరి పోలీసు స్టేషన్‌కు చెందిన ఎఎస్ఐ రాము. రెండురోజుల క్రితం ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్ళి చేసుకున్నారు ఎఎస్ఐ రాము బంధువైన బింధు, జ్యోతిస్వర్.
 
పెళ్ళి చేసుకొని రక్షణ కోసం చిత్తూరు మహిళా పిఎస్‌ను ఆశ్రయించారు ప్రేమజంట. బిందు మిస్సింగ్ పైన రెండురోజుల క్రితం తిరుపతి వెస్ట్ పిఎస్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఫేస్ బుక్‌లో బిందు, జ్యోతీశ్వర్‌ల పెళ్ళి ఫోటోలపై లైకులు కొట్టారు నెహ్రూనగర్ వాసులు. తమ సమీప బంధువైన బిందు ప్రేమ పెళ్ళికి లైకులు కొట్టిన వారిపై దాడికి దిగాడు ఎఎస్ఐ రాము, అతని అనుచరులు.
 
మహేష్ అనే యువకుడు తన స్నేహితురాలి పెళ్ళి చేసుకున్నందుకు ఫేస్ బుక్‌లో లైక్ కొట్టాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఎఎస్ఐ రాము.. మహేష్ ఇంట్లో శుభకార్యం జరుగుతుండగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ మహేష్ పైన దాడి చేశారు. దీంతో బాధితులు వెస్ట్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు.