మంగళవారం, 5 ఆగస్టు 2025
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (16:55 IST)

హనుమాన్‌కు ప్రీతకరమైన పువ్వులు..?

ఆంజనేయ స్వామి అంటే అందరికీ పరమ ప్రీతి. అలాంటి స్వామివారికి పూజలు చేయవలసిన ప్రత్యేక రోజులు - శనివారం, మంగళవారం, గురువారం. పురాణకథ ప్రకారం, ఓసారి శని ఆంజనేయస్వామిని తన ప్రభావంతో వశపరచుకోవాలని ప్రయత్నించగా, స్వామి అతనిని తలక్రిందలుగా పట్టి, ఎగురవేయసాగాడు. అప్పుడు శని తన అపరాధాన్ని మన్నించమని కోరగా, స్వామివారు తనను, తన భక్తులను ఎప్పుడూ పీడించనని శని మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతారు. 
 
అందువలన శనిదోషాలతో బాధపడేవారు శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి ఉపాశన చేస్తే మంచి కలిగి, శనిదోషం తగ్గుతుంది. ఇతరులు మంగళ, గురు, శనివారాలలో ఏ రోజైనా స్వామికి పూజలు చేసుకోవచ్చును. హనుమాన్‌కు ప్రీతకరమైన పువ్వులు.. మల్లె పువ్వులు, పారిజాతాలు, తమలపాకుల దండ, కలువలు. 
 
ఇక శ్రీ విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలతో స్వామి పంచముఖ హనుమంతుడుగా వెలిసాడు. ఈ పంచముఖముల వివరాలు ఓసాసారి..
 
1. తూర్పు ముఖం - పాపాలను హరించి, చిత్త శుద్దిని కలుగుచేస్తారు. 
2. దక్షిణ ముఖం - శతృభయాన్ని పోగొట్టి, విజయాన్ని కలుగజేస్తారు. 
3. పడమర ముఖం - మహావీరగరుడ స్వామి, దుష్ట ప్రభావాలను పోగొట్టి, శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తారు. 
4. ఉత్తర ముఖం - లక్ష్మీవరాహమూర్తి గ్రహ చెడు ప్రభావాలను తప్పించి, అష్టైశ్వర్యాలను కలుగజేస్తారు. 
5. ఊర్థ్వంగా ఉండే హయగ్రీవస్వామి జ్ఞానాన్ని, జయాన్ని, మంచి జీవనసహచరిని, బిడ్డలను ప్రసాదిస్తారు.