శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (09:28 IST)

రేయ్... నా.. కొ.. కా... మరదలిని పెళ్లి చేసుకున్న భర్తకు భార్య బడిత పూజ

తొలి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్తకు ఓ భార్య బడిత పూజ చేసింది. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు కలిసి ఆ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజ అనే మహిళతో వివాహమైంది. ఆమెకు పిల్లలు పుట్టలేదు. దీంతో ఆమెను మానసికంగా వేధించసాగాడు. ఈ వేధింపులు భరించలేని శైలజ.. భర్తను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్లింది .
 
ఇదే అదునుగా భావించిన సాంబశివరావు భార్యకు తెలియకుండా మరదలి వరుస అయ్యే మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ ఆగ్రహంతో రగిలిపోయింది. తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది.
 
అంతేనా, విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకున్న భర్త పట్టుకుని ఉతికి ఆరేసింది. రెండో భార్యతో ఏకాంతంగా భర్త ఉన్నపుడు ఇంటిపై దాడి చేసి ఆయన్ను పట్టుకుంది. ఆ తర్వాత భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులంతా కలిసి పట్టుకుని చావబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సాంబశివరావును రక్షించి, కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.