శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (14:06 IST)

భార్యను తీస్కుని పక్క ఊరికొచ్చినా వదలని ప్రియుడు... ఇంట్లో భార్యతో ఏకాంతంగా చూసి...

వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. తన భార్య మరొక యువకుడి మోజులో పడి అతడితో అక్రమ సంబంధం నెరపుతుండటంతో ఆమె భర్త ఆ ఊరినే వదిలేసి హైదరాబాద్ నగరానికి వలస వచ్చేశాడు. కానీ ఆమె ప్రియుడు ఆమె కోసం అక్కడికీ వచ్చాడు. అంతే... తన భార్యతో ఏకాంతంగా వున్న యువకుడిని పొట్టలో పొడిచి పొడిచి హత్య చేశాడు. 
 
వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌ జిల్లాలోని రేకులతండాకు చెందిన భార్యాభర్తలు 32 ఏళ్ల రమేశ్, 27 ఏళ్ల శాంతిలు కూలిపనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నారు. కూలీ పనులు చేసే క్రమంలో శాంతికి 28 ఏళ్ల రాముతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇది గమనించిన ఆమె భర్త పెద్ద మనుషులతో పంచాయతీ పెట్టాడు. అక్కడ అంతా రామును మందలించి వదిలేశారు. కానీ రాము ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించలేదు.
 
ఇక అక్కడే వుంటే తన భార్యను అతడు వదలడని నిశ్చయించుకున్న రమేష్ ఆమెను తీసుకుని హైదరాబాద్ నగరానికి వలస వెళ్లిపోయాడు. మణికొండలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పని చేస్తూ భార్యతో అక్కడే ఉంటున్నాడు. ఐతే బుధవారం రాత్రి రమేష్ ఇంట్లో లేని సమయంలో రాము వచ్చాడు. అప్పుడే రమేష్ కూడా ఇంటికి రావడంతో ఇద్దరూ ఏకాంతంగా అతడికి పట్టుబడ్డారు. అంతే... కోపంతో రగిలిపోయిన రమేష్... ఇంట్లో కూరగాయలు కోసుకునే కత్తిని తీసుకుని అతడి పొట్టలో పొడిచి పొడిచి చంపేశాడు. ఆ తర్వాత ఆ కత్తిని తీసుకుని వెళ్లి పోలీసు స్టేషనులో లొంగిపోయాడు.