శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 5 జూన్ 2019 (11:43 IST)

నిద్రిస్తున్న భార్యపై సిలిండర్‌ వేశాడు.. ఇంటి వాకిట్లో పందిరికి ఉరేసుకున్నాడు...

భార్యాభర్తల గొడవలు చివరికి ప్రాణాలను బలిగొంది. చిన్నపాటి గొడవలకే ఆవేశానికి గురవుతూ నేరాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. కోవైలోని వేడపట్టికి చెందిన మారిముత్తు (65) ఓ ప్రైవేట్ కంపెనీకి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఇతని రెండో భార్య సుబ్బమ్మ. ఈ దంపతులు సంతానం లేరని తెలుస్తోంది. వీరితో మారిముత్తు సోదరుడు కృష్ణ కూడా నివసిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఇతడు మానసిక రోగి అని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో మారిముత్తు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. భార్యాభర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆపై సుబ్బమ్మ నిద్రపోయింది. భార్య నిద్రపోతున్న సమయంలో గొడవపడిందనే ఆవేశంతో భర్త మారిముత్తు సిలిండర్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో సుబ్బమ్మ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. 
 
ఆపై జరిగిన విషయానికి పశ్చాత్తాపపడిన మారిముత్తు ఇంటి వాకిట్లోనే పందిరికి ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న మారిముత్తు ఘటన స్థానికంగా కలకలం రేపింది.