సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 3 జూన్ 2019 (14:34 IST)

ప్రియుడితో రాసలీలలు.. కళ్లారా చూసిన భర్తను.. భార్య ఏం చేసిందంటే?

వివాహేతర సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. కట్టుకున్న భర్తకు ద్రోహం చేస్తున్నామని తెలిసే కొందరు మహిళలు అక్రమసంబంధాలకు మొగ్గుచూపుతున్నారు.


అంతేగాకుండా ఈ సంబంధాలకు అడ్డుగా వున్న వారిని చంపేందుకు కూడా వెనుకాడట్లేదు. తాజాగా అలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రేమికుడితో ఉల్లాసంగా వున్న భార్యను భర్త కళ్లారా చూశాడు. అంతే కిరాయి ముఠాతో భర్తను హత్య చేయించింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. మైసూరు జిల్లా, ఉన్సూరు ప్రాంతంలో గొంతుకోసి చంపబడిన ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలెట్టారు.

దర్యాప్తులో మృతుడు శివకుమార్ అని తేలింది. అతని భార్య వద్ద జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు వెలుగులో వచ్చాయి. దివ్య పెళ్లికి ముందే చేతన్ అనే వ్యక్తిని ప్రేమించింది. 
 
అయితే కొన్ని కారణాల వల్ల శివకుమార్‌ను పెళ్లి చేసుకుంది. కానీ ప్రేమికుడిని ఏమాత్రం మరిచిపోలేకపోయింది. భర్త కొనిపెట్టిన ఫోన్ ద్వారా ఫేస్‌బుక్ ద్వారా మాజీ ప్రేమికుడు చేతన్‌తో చాటింగ్ చేసేది.

అంతటితో ఆగకుండా భర్త ఇంట్లో లేని సమయం చూసుకుని ఇంటికి రప్పించుకునేది. ఈ క్రమంలో దివ్య, చేతన్ పలుసార్లు శారీరకంగా కలిసారని పోలీసులు తెలిపారు. 
 
కానీ ఓసారి అనూహ్యంగా భర్త కంట పడిందని.. ప్రేమికుడితో శృంగారంలో వుండగా దివ్య పట్టుబడిందని, తర్వాత కిరాయి ముఠాకు డబ్బులిచ్చి భర్తను హతమార్చిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి దివ్య, చేతన్, కిరాయి ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.