బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 6 జూన్ 2019 (12:28 IST)

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను... భూమన కరుణాకర్ రెడ్డి, ఏం.. మంత్రి పదవి రాలేదా?

వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన భూమన కరుణాకర్ రెడ్డి వైసీపీ సర్వసభ్య సమావేశంలో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి షాకిచ్చారు. కరుణాకర్ రెడ్డి ఇలా ప్రకటించడంతో అక్కడివారంతా భూమన అభినయ్ రెడ్డి నాయకత్వం కావాలంటూ నినాదాలు చేశారు.
 
ఇంకా భూమన మాట్లాడుతూ... తన గెలుపు కోసం పనిచేసిన ప్రతికార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. తిరుపతిలో టిడిపిని ఓడించడమంటే అంత తేలిక కాదనీ, ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించడమంటే మంత్రి పదవి కంటే గొప్పదన్నారు. మంత్రి పదవి కంటే గొప్పది అని భూమన అంటున్నారు కాబట్టి జగన్ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కలేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో జగన్ కేబినెట్లో ఎవరెవరి పేర్లు వుంటాయో చూడాల్సిందే.