1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Bheemla Nayak Postponed? Not sure yet

వెనక్కి తగ్గిన 'భీమ్లా నాయక్'! .. శివరాత్రికి రిలీజ్?

Bheemla Nayak
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగానే చేదువార్తే. పవన్ - రానా కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్' చిత్రం విడుదల మరోమారు వాయిదాపడింది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్‌ మాటలు సమకూర్చి, పర్యవేక్షణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలన్నీ ఓ మోత మోగిస్తున్నాయి. 
 
అయితే, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత థియేటర్ల సమస్యతో పాటు ఇతర కొన్ని కారణాల రీత్యా వెనక్కితగ్గినట్టు పుకార్లు వచ్చాయి. అయితే, నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ జనవరి 12వ తేదీనే రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
 
ఈ నేపథ్యంలో 'భీమ్లా నాయక్' చిత్రం వాయిదాపడినట్టు వార్తలు వస్తాయి. సంక్రాంతి బరినుంచి తప్పుకుని ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదాపడినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారడంతో నేడు ఈ పుకార్లపై నిర్మాత స్పందించే అవకాశం ఉంది. అయితే, చిత్రాన్ని శివరాత్రికి విడుదల చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. 
తర్వాతి కథనం
పనామా పత్రాల లీక్ కేసు : ఈడీ ప్రశ్నలతో ఐశ్వర్య ఉక్కిరిబిక్కిరి