బిగ్ బాస్ ఐదో సీజన్- ఈసారి కూడా పవన్ అభిమానికే టైటిల్?
బిగ్ బాస్ ఐదో సీజన్ ఫైనల్ స్టేజీకి వచ్చేసింది. ఈ షోలో విజేత ఎవరనేది త్వరలో తేలిపోనుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజేత ఎవరనేదానిపై చర్చ సాగుతోంది. ఎప్పటి మాదిరిగానే విజేతను నిర్ణయించేది పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్సే అనే వాదన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే బిగ్‌బాస్ తెలుగు సీజన్ 1 విషయానికి వస్తే.. ఆ షోలో శివబాలాజీకి పవన్ కల్యాణ్ అంటే ఇష్టం. అతనే విజేతగా నిలిచాడు.
ఇక రెండో సీజన్‌లో అద్భుతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకొన్న కౌశల్ మండాకు పవన్ కల్యాణ్ అంటే చెప్పలేనంత ఇష్టం. పవర్ స్టార్‌కు వీరాభిమాని. ఇతనే రెండో సీజన్ విన్నర్‌గా నిలిచాడు.
ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో తనదైన శైలిలో ఆకట్టుకొన్న నటుడు అభిజిత్ దుడ్డాల కూడా పవర్ స్టార్ అభిమానియే. ఆయన పలు సందర్భాల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. అభిజిత్ సీజన్ 4 విజేతగా నిలవడంలో కీలక పాత్రను పోషించిన వారిలో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఒకరంటే ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు.
బిగ్‌బాస్ సీజన్ కొనసాగుతున్న సమయంలో సోషల్ మీడియా ద్వారా అభిజిత్‌కు పవర్ స్టార్ ఫ్యాన్స్ బహిరంగంగానే మద్దతు తెలిపారు. దాంతో ఆయన విజేతగా నిలుపడానికి ముందుండి నడిపించారు.
ఇదిలా ఉండగా, ప్రస్తుత సీజన్ బిగ్‌బాస్ తెలుగు 5లో టాప్ కంటెస్టెంట్‌గా మారిన వీజే సన్నీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ వీడియో జాకీ మెగా అభిమాని కూడా. పలు సందర్భాల్లో రాంచరణ్ అంటే ఇష్టం అంటూ షోలో కామెంట్ చేశారు.
టాస్కులు, ఆటపాటల సందర్భాల్లో పవన్ అంటే తనకు ఎంత ప్రేమో అనే విషయాన్ని స్పష్టం చేశారు. తన 100 రోజులకపైగా జర్నీని చూపిసుండగా.. రాంచరణ్ తన ఫోటోలో ఉన్నాడంటూ సంతోషంగా చెబుతూ కనిపించారు.
ప్రస్తుతం బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లో విజేతగా నిలువడానికి బరిలో నిలిచిన వీజే సన్నీకి అండగా కేవలం పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా మెగా అభిమానులు కూడా సపోర్ట్‌గా నిలుస్తున్నట్టు సోషల్ మీడియాలో స్పష్టమైంది. ఇక బిగ్‌బాస్ తెలుగు 5 విజేతగా నిలిచే కంటెస్టెంట్ భారీగా ప్రైజ్ మనీని, బహుమతులు గెలుచుకోబోతున్నారు.
బిగ్‌బాస్ నిర్వాహకులు ఇప్పటికే 50 లక్షల రూపాయలు ప్రైజ్ మనీగా ప్రకటించగా.. ఈ షోకు స్పాన్సర్‌గా నిలిచిన రియల్ ఎస్టేట్ కంపెనీ షాద్ నగర్‌లో ఓ వెంచర్‌లో ప్లాటును ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ఇంకా స్పాన్సర్లు భారీగా గిఫ్టులు అందించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.