శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (11:24 IST)

డిసెంబర్ 19న బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలే.. ఆర్ఆర్ఆర్ అండ్ మెగాస్టార్?

బిగ్‌బాస్-5 గ్రాండ్ ఫినాలేకు గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వచ్చి విన్నర్‌కు ట్రోఫీని అందించగా.. ఈ ఏడాది మాత్రం బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనేలతో పాటు ఆర్.ఆర్.ఆర్ మూవీలో నటించిన రామ్‌చరణ్, ఆలియాభట్ జంటను బిగ్‌బాస్ నిర్వాహకులు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. 
 
కాగా టాప్-5లో వీజే సన్నీ, షణ్ముఖ్ జశ్వంత్, సిరి, మానస్, శ్రీరామ్‌ ఉన్నారు. వీరిలో విన్నర్‌గా నిలిచేది ఎవరో వచ్చే ఆదివారం రివీల్ కానుంది. వీజే సన్నీనే బిగ్‌బాస్-5 విన్నర్ అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది.
 
బిగ్‌బాస్-5 తెలుగు సీజన్ ఈ వారంతో ముగియనుంది. ఈ ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆ రోజే విన్నర్ ఎవరో తెలిసిపోతుంది. డిసెంబర్ 19న జరిగే ఈ ఫైనల్‌కు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.