శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 డిశెంబరు 2021 (10:18 IST)

ఢీ-13లో విజేత కావ్య ఎవరో తెలుసా?

kavya
ఢీ-13లో విజేతగా నిలిచింది డ్యాన్సర్ కావ్య. ఈ కావ్య ఎవరు? ఆమె గురించిన వివరాలను ఇక్కడ తెలుసుకుందాం. విజేత కావ్య తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్య అభ్యసిస్తోంది.

తాండూరు పట్టణంలోని నిరుపేద కుటుంబంలో జన్మించిన కావ్య చిన్నతనం నుండి డ్యాన్స్‌పై ఆసక్తితో గొప్ప డ్యాన్సర్ కావాలనుకునేది. 
 
ఈ టీవీలో వచ్చే డ్యాన్స్ ప్రోగ్రాంలు చూస్తూ తాను కూడా డ్యాన్సర్ కావాలనుకుంది. ఆ కలలను నిజం చేసుకోవాలని తాండూర్‌లోని ప్రముఖ డ్యాన్స్ మాస్టర్‌లతో ప్రత్యేక శిక్షణ తీసుకుని.. సెలక్షన్‌లో స్థానం కొట్టేసింది.  
 
ప్రస్తుతం డ్యాన్స్ మాస్టర్లు ఢీ-13 సెలక్షన్స్‌లోకి పంపడంతో తన ప్రతిభను నిరూపించుకుని విజేతగా నిలవడం తాండూర్ ప్రజల గర్వకారణం అంటున్నారు. విజేత కావ్య తాండూరు పట్టణంలోని భాష్యం కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్య అభ్యసిస్తోంది.
 
ఈ సందర్భంగా విజేత కావ్య మాట్లాడుతూ.. ఎంతో అట్టడుగు స్థాయి నుంచి వచ్చానని తన తండ్రి సామాన్య లారీ డ్రైవర్ అని చెప్పింది. తన తల్లిదండ్రుల ప్రోత్సాహం, డ్యాన్స్ నేర్పించిన గురువుల ఆశీస్సులతోనే తాను ఢీ-13 టైటిల్ గెలవడం జరిగిందని తెలిపారు.