ఆరు విభాగాల్లో రామ్ చరణ్ ట్రోఫీ - 2021 పోటీలు ప్రారంభం
Ram Charan Trophy - 2021
ఈ రోజు వైజాగ్ VJF ప్రెస్ క్లబ్లో రాష్ట్ర స్థాయి పోటీల పోస్టర్ ని ప్రముఖ స్టార్ మేకర్ సత్యానంద్ చేతుల మీదుగా ప్రారంభించగా, రాంచరణ్ ట్రోఫీని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షులు ,రాష్ట్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి ఏడిద బాబీ, మెగా అభిమానులు & ఆర్గనైజర్లు సమక్షంలో ట్రోఫీని ప్రారంభించారు. ఈ ''రాంచరణ్ ట్రోఫీ '' పోటీలలో ఆరు విభాగాల్లో గెలిచిన ఫైనల్స్ విజేతలకు 19 - 12 -2021వ తేదీ ఉదయం 9 గంటలకు విశాఖ ఉడా చిల్డ్రన్స్ ఏరినా ఆడిటోరియం లో ప్రముఖ అతిధుల చేతుల మీదుగా కాష్ ప్రైజ్ సహాయ ట్రోఫీ బహుకరించబడుతుంది.
ఈ కార్యక్రమాన్ని విశాఖపట్నం 'ధనుంజయ ఛానల్' నిర్వహిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర చిరంజీవి యువత భవాని అధ్యక్షులు రవి కుమార్ ఒక ప్రకటన విడుదల చేసారు.
తర్వాతి కథనం
