ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 23 నవంబరు 2021 (17:41 IST)

బిగ్ బాస్ 5.. యానీ మాస్టర్ సంచలనం.. కాజల్‌ను ఏకేసింది.. అమ్మాయిలు ఎదురైతే..?

Anee Master
బిగ్ బాస్ ఐదో సీజన్ 12వ వారానికి చేరుకుంది. ఈవారం ఎలిమినేషన్స్ ప్రక్రియలో చాలా ట్విస్ట్‌లు ఉండబోతున్నాయి. 12 వారం నామినేషన్స్‌లో హౌస్ కెప్టెన్‌గా ఉన్న మానస్ తప్ప మిగిలిన సన్నీ, కాజల్, ప్రియాంక, రవి, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ ఈ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే ఈ ఏడుగురులో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందనే తెలియాల్సి వుంది.  11 వ వారం ఓటింగ్‌లో సన్నీ అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి తొలిస్థానంలో నిలిచాడు.
 
ఇక 12 వారంలోనూ అదే దూకుడు చూపిస్తున్నాడు. ప్రస్తుతం అన్ అఫీషియల్ పోల్‌లో సన్నీ తొలిస్థానంలో ఉండగా.. షణ్ముఖ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే షణ్ముఖ్ తిరిగి పుంజుకోవడం పెద్ద కష్టం కాదు.  మొత్తంగా ఈవారం ఓటింగ్‌లో సన్నీ, షణ్ముఖ్ తొలి రెండు స్థానాల్లో ఉంటే.. అనూహ్యంగా కాజల్ మూడో స్థానానికి దూసుకొచ్చింది. 
 
నిజానికి యాంకర్ రవి మూడో స్థానంలో కొనసాగుతుండగా.. మంగళవారం నాటికి వచ్చేసరికి రవిని బీట్ చేసింది కాజల్. ఆనీ మాస్టర్ వెళ్లిపోయినా ఆమె బ్యాచ్ సభ్యులు రవి, శ్రీరామ్‌లు కాజల్‌ని టార్గెట్ చేయడంతో ఆమెకు సింపథీ ఓట్లు బాగా పడుతున్నాయి. పైగా మానస్ కెప్టెన్ కావడంతో అతని ఓట్లు.. అలాగే సన్నీ ఫ్యాన్స్ ఓట్లు కాజల్‌కి షేర్ అవుతున్నాయి.
 
ఇక నాలుగో స్థానంలో రవి ఉంటే.. ఐదో స్థానానికి పడిపోయాడు శ్రీరామ చంద్ర. సీజన్ ప్రారంభం నుంచి తన పని తాను చూసుకుని పోతూ జన్యూన్ ప్లేయర్‌గా పేరొందిన శ్రీరామ్.. 12 వ వారంలో తన మాస్క్ పూర్తిగా తొలగించాడు. మొదటి నుంచి హోస్ట్ నాగార్జున సపోర్ట్ శ్రీరామ చంద్రకి ఫుల్‌గా ఉంది. అతని భారీగా హైప్ ఇస్తుంటారు. 
 
అయితే 12 వారంలో ఎప్పుడైతే సన్నీకి ఎవిక్షన్ పాస్ లభించి.. ఆనీ మాస్టర్ ఎలిమినేట్ అయ్యింది.. శ్రీరామ్ ఏడుపు మొదలైంది. డిఫరెంట్ యాటిట్యూడ్‌తో వరస్ట్ బిహేవియర్‌తో పదే పదే కాజల్‌, సన్నీలను టార్గెట్ చేస్తున్నాడు. లాజిక్ లేని ప్రశ్నలు వేస్తూ అడ్డంగా వాదిస్తూ.. తన ఓటింగ్ షేర్‌ని తనకి తానుగా పాతాళానికి తొక్కేసుకున్నాడు. ఈ ప్రభావంతో శ్రీరామ చంద్ర ఈవారం ఓటింగ్‌లో ఐదో స్థానానికి పడిపోయాడు.
 
ఇక మిగిలింది సిరి, ప్రియాంక. ఈ ఇద్దరిలో ఎవర్ని పంపాలన్నది మాత్రం బిగ్ బాస్ చేతుల్లోనే ఉంటుంది. ఎవిక్షన్ పాస్‌ని ఇప్పుడు కాకుండా తరువాత వారానికి వాయిదా వేస్తే మాత్రం ప్రియాంక ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. 
 
ఇదిలా వుంటే... బిగ్ బాస్ ఐదో సీజన్ నుంచి ఆనీ మాస్టర్ బయటకు వచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆనీ మాస్టర్‌ను హోస్ట్ నాగార్జున‌, బిగ్‌బాస్ స్పెష‌ల్ ప‌వ‌ర్స్ ఇస్తూ కాపాడుతూ వ‌చ్చార‌ని, ఆమెకు అంత సీన్ లేద‌ని, ఆమె కంటే బ‌ల‌మైన కంటెస్టెంట్స్ అంద‌రూ బ‌య‌ట‌కు వెళ్లిపోయార‌ని నెటిజ‌న్స్ కౌంట‌ర్స్ మీద కౌంట‌ర్స్ ఇస్తూ వ‌చ్చారు. 
 
ఏదైతేనేం ఈ వారం ఆనీ మాస్టర్‌కు త‌క్కువ ఓట్లు వేసి ఆమెను బ‌య‌ట‌కు పంపేశారు. బయటకు వచ్చిన తర్వాత అరియానాకు ఆనీ మాస్టర్ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఒక్కొక్కరి గురించి త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించింది.
 
ఆనీ మాస్టర్‌. ష‌న్ను గురించి అడిగిన‌ప్పుడు అత‌ను మామూలుగా ఒక‌లా న‌డుస్తాడ‌ని, ఎవ‌రైనా అమ్మాయిలు ఎదురైతే త‌న న‌డ‌క స్టైల్ మారిపోతుంద‌ని చెప్పింది.  ఆనీ మాస్ట‌ర్ ష‌న్ను న‌డ‌క గురించి కామెంట్ చేసింది. ష‌న్నుతో ఎమోష‌న‌ల్‌గా క‌నెక్ట్ అయిపోతున్నానని సిరి చెబుతుందిగా దానికి ఏమంటారు అని అడిగిన‌ప్పుడు అయ్యో అత‌ని మాత్ర‌మే హ‌గ్గులు దొరుకుతున్నాయ‌ని, మేం ఎదురుచూసినా దొర‌క‌డం లేదంటూ కామెంట్స్ చేసింది.  
 
హౌస్‌లో ఆనీ మాస్ట‌ర్‌కు కాజ‌ల్‌కు మ‌ధ్య ఢీ అంటే ఢీ అనేలా మాట‌ల యుద్ధం న‌డిచింది. ఒక‌రినొక‌రు మాట‌ల‌తో ఇబ్బంది పెట్టుకున్నారు. అలాంటి కాజ‌ల్ గురించి అడిగిన‌ప్పుడు మ‌నిషి చ‌చ్చిపోతున్నా త‌న‌కు ప‌ట్ట‌ద‌ని, నీ స్ట్రాట‌జీ ఏంటో చెప్పు అని అడుగుతుంద‌ని అంటూ త‌న‌దైన శైలిలో కామెంట్స్ చేసింది. శ్రీరామ్ గురించి మాట్లాడుతూ త‌ను నాలుగోవారం నుంచి నాకు మాన‌సికంగా స‌పోర్ట్ చేస్తూ వ‌చ్చాడ‌ని..బ్ర‌ద‌ర్‌లా, ఫ్రెండ్‌లాగా అండ‌గా నిల‌బ‌డ్డాడ‌ని అంది.