మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: ఆదివారం, 12 డిశెంబరు 2021 (20:40 IST)

ఉక్కు దీక్ష అని చెప్పి ఉక్కు మాటే మాట్లాడని పవన్ మాటలు ఆవుకథలా వున్నాయి: అంబటి

జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం చేసిన ఉక్కు దీక్షపై వైసిపి ఎమ్మెల్యే అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆవుకథలా వుందని ఎద్దేవా చేశారు.

 
ఉక్కు సంరక్షణపై దీక్ష అని చెప్పిన పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఎక్కడా ఉక్కు మాటే మాట్లాడలేదని అన్నారు. ప్రత్యేక హోదాను ఎప్పుడో చంద్రబాబు నాయుడు వెయ్యి అడుగుల లోతు గొయ్యి తీసి అందులో పాతిపెట్టారని అన్నారు. ఐనా ప్రైవేటీకరణ నిర్ణయం చేసిన భాజపాతో అంటకాగుతూ వున్న పవన్ కళ్యాణ్, ఉక్కు సంరక్షణ గురించి భాజపానే నిలదీస్తే బాగుంటుందని అన్నారు.

 
వారసత్వ రాజకీయాలకు తను వ్యతిరేకమనీ, ప్రధాని మోదీ అందుకే తనకు నచ్చారని అంటున్నారు బాగానే వుంది కానీ మరి పవన్ కళ్యాణ్ వారసత్వం ద్వారా హీరో అవలేదా అని ప్రశ్నించారు.

 
రాజకీయాలకు ఒక న్యాయం, సినిమాలకైతే మరో న్యాయమా అని ప్రశ్నించారు. మొత్తమ్మీద పవన్ కళ్యాణ్ ఎందుకు దీక్ష చేసారో ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కావడం లేదని సెటైర్లు వేసారు అంబటి రాంబాబు.