శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 10 డిశెంబరు 2021 (21:51 IST)

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ దీక్ష‌కు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌, ప్రభుత్వానికి డిమాండ్...

విశాఖ ఉక్కు ఉద్య‌మం నీరుకారిపోతుండ‌గా, ప‌వ‌న్ క‌ల్యాణ్ దానిని మరోసారి భుజాన వేసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఈ నెల 12న విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్షలో పాల్గొననున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు దీక్ష చేయనున్నారు. ఉక్కుపై 300 రోజులుగా కార్మికులు పోరాడుతున్నా సీఎం స్పందించడంలేదని పవన్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమపై సీఎం జగన్‌ స్పందించాలని డిమాండ్‌ చేశారు. 
 
 
రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను సీఎం దిల్లీ తీసుకెళ్లాలని సూచించారు. కార్మికులకు మద్దతు కొనసాగింపుగా పవన్‌ దీక్ష చేయనన్నట్టు జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. పవన్‌తో పాటు పార్టీ నేతలు నాదెండ్ల మనోహర్‌, పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు దీక్షలో పాల్గొంటారని పేర్కొన్నారు.