మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (14:50 IST)

ఆద్య టాలెంట్‌కు ఫిదా... పవర్ స్టార్ కూతురా? మజాకా?

Adya
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌- రేణూదేశాయ్‌ల పిల్లలు అకీరా, ఆద్యలకు సంబంధించి ఏ వార్త బయటకు వచ్చిన కూడా అది కొద్ది క్షణాలలోనే వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా రేణూ దేశాయ్ తన సోషల్ మీడియాలో ఆద్యకి సంబంధించి ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఆద్య ప్రతిభను అందరికీ పరిచయం చేసింది. 
 
ఆద్య గిటార్ వాయిస్తూ పాట పాడటం కనిపిస్తోంది. దీంతో ఆద్య టాలెంట్‌కు అంతా ఫిదా అవుతున్నారు. పవర్ స్టార్ కూతురా? మజాకా? అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
 
అకీరా నందన్‌కు కూడా మ్యూజిక్ ప్లే చేయడం ఇష్టమన్న సంగతి తెలిసిందే. పియానోను అకీరా నందన్ అద్బుతంగా వాయిస్తాడు. ఆ మధ్య ఉత్తేజ్ కూతురు పాటతో కలిసి తెగ సందడి చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాని షేక్ చేసింది. 
 
ఇక పవన్ విషయానికి వస్తే ఆయన నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి బరిలో విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత క్రిష్‌, సురేందర్ రెడ్డి, హరీష్ శంకర్ వంటి దర్శకులతో పలు సినిమాలు చేయనున్నారు.