బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 డిశెంబరు 2021 (12:52 IST)

వరంగల్ జిల్లాలో దారుణం.. కుమార్తె హతమార్చిన తల్లి, అమ్మమ్మ

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కుమార్తె కులాంతర వివాహం చేసుకుంటే తమ పరువు పోతుందని భావించిన తల్లి ఏకంగా తన కుమార్తెను కడతేర్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్, పర్వతగిరి మండల కేంద్రానికి ఉబ్బని సమ్మక్కకు ఇద్దరు కుమార్తెలు భర్త చనిపోవడంతో కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. 
 
పెద్ద కుమార్తెకు వివాహం జరగడంతో.. చిన్న కుమార్తె అంజలి(17) తల్లి వద్ద వుంటూ స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన రాయపురం ప్రశాంత్ అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. ఈ వ్యవహారం తల్లికి తెలియడంతో కుమార్తెను మందలించింది. కులాంతర వివాహం కుదరదని తేల్చి చెప్పేసింది. 
 
అయినా అంజలి తీరు మారకపోవడంతో తమ కుటుంబ పరువు తీస్తోందనే ఆగ్రహంతో చివరికి చంపాలని నిర్ణయించుకున్నారు. నవంబరు 19న అర్థరాత్రి ఇంటిలో నిద్రిస్తున్న అంజలి గొంతును తల్లి నులమగా, అమ్మమ్మ ముఖంపై దిండుతో అదిమింది. 
 
అంజలీని ఊపిరి ఆడకుండా చేసి హత్యచేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు బయటకు వచ్చి ఆమె ఆత్మహత్య చేసుకుందని కేకలు వేశారు. కానీ పోలీసులు జరిపిన దర్యాప్తులో నిందితులు అంజలి తల్లి, అమ్మమ్మేనని తేలింది. పోలీసులు వారి అదుపులో తీసుకున్నారు