శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 25 జులై 2019 (14:43 IST)

బిగ్ బాస్ 3 తెలుగు.. వైరల్ అవుతోన్న ఫన్నీ వీడియో

బిగ్ బాస్ 3 తెలుగు సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. టాస్క్‌ల పట్ల హౌజ్‌మేట్స్ బిజీగా వున్నారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు డబ్ స్మాష్‌లతో, ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో బిగ్ బాస్ హౌజ్ కంటిస్టెంట్లను ఆటపట్టిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో బిగ్ బాస్ కంటిస్టెంట్లను ట్రోల్ చేస్తూ వీడియోలు హల్ చల్ చేస్తున్నాయి. హౌస్‌మేట్స్, వారి తీరుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. 
 
ఈ సందర్భంగా ‘అన్‌ఫ్రొఫెషన్ తెలుగు కమెడియన్ - యూటీసీ’ అనే యూజర్ తయారు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హౌస్‌మేట్స్ తీరుకు కొన్ని సినిమా సీన్లను జోడిస్తూ రూపొందించిన ఈ వీడియో కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ నెల 23న పోస్టు చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు 369 మంది షేర్ చేసుకోగా 70 వేల మంది వీక్షించారు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.